#128Silent night, Holy night
Author: జోసెఫ్ మోర్Category: సాయంతనారాధన
1.
శుద్ధరాత్రి! సద్దణంగ నందు నిద్రపోవ శుద్ధ దంపతుల్ మేల్కొనగా పరిశుద్ధుడౌ బాలకుడా! దివ్య నిద్ర పోమ్మా దివ్య నిద్ర పోమ్మా.
2.
శుద్ధరాత్రి! సద్దణంగ దూతల హల్లెలూయా గొల్లవాండ్రకు దెలిపెను క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను.
3.
శుద్ధరాత్రి! సద్దణంగ దేవుని కొమరుడా నీ ముఖంబున ప్రేమ లొల్కు నేడు రక్షణ మాకు వచ్చె నీవు పుట్టుట చే నీవు పుట్టుట చే.