#110యేసు జన్మము
Author: ఫేలిక్స్ ఆండ్రూComposer/Ragam: హరికాంభోజిCategory: సాయంతనారాధన
ప
పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్యమార్గము చూపన్ – పుట్టి నట్టి యయ్య పరమ గురుడు – ప్రాయశ్చిత్తుడు యేసుడు ||పుట్టె||
1.
ధరను పిశాచిని వేడిన దుర్జనుల బ్రోచుటకై యా పరమవాసి పాపహరుడు – వరభక్త జన పోషకుడు ||పుట్టె||
2.
యూదయ దేశములోను – బేత్లెహేమను గ్రామమున – నాదరింపనుద్భవించె – నధములైన మనల ||పుట్టె||
3.
తూర్పు జ్ఞానులు కొందరు – పూర్వ దిక్కు చుక్కను గాంచి – సర్వోన్నతుని మరి కొమరుని – కర్పణములిచ్చిరి ||పుట్టె||