#112రక్షకుని జననము
Author: మోచర్ల రాఘవయ్యComposer/Ragam: మధ్యమావతిCategory: సాయంతనారాధన
ప
రక్షకుండుదయించినాడట – మనకొరకు పరమ రక్షకుండుదయించినాడట – రక్షకుండుదయించినాడు – రారే గొల్లబోయలారా – తక్షణమున బోయి మన నిరీక్షణ ఫలమొందుదము ||రక్షకుండు||
1.
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు – దేవుడగు యెహోవా మన దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||
2.
గగనమునుండి డిగ్గి ఘనుడు గాబ్రియేలు దూత – తగినట్లు చెప్పె వారికి – మిగుల సంతోషవార్త ||రక్షకుండు||
3.
వర్తమానము జెప్పి దూత వైభవమున బోవుచున్నాడు – కర్తను గాంచిన వెనుక – కాంతుము విశ్రమంబప్పుడు ||రక్షకుండు||
4.
పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రముల జుట్టి – శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||
5.
అనుచు గొల్లలొకరి కొకరు రానవాలు జెప్పుకొనుచు – అనుమతించి కడకు క్రీస్తునందరికిని దెల్పినారు ||రక్షకుండు||