#101Awake my soul is joyful lays
Author: ఎస్. మెడ్లేCategory: సాయంతనారాధన
1.
నా జీవమా! నీవు నీ యజమానుడైన దేవుని దయాలుని కీర్తించుము ప్రియంబుతో నీ రక్షకునకున్ ప్రపూర్ణ ప్రేమ పాడుము.
2.
నే పాపమందున గూలియుండగన్ కాపాడి నన్ను లేపెనే నా పాలి పుణ్య రక్షకునకున్ ప్రపూర్ణ ప్రేమ పాడుము.
3.
ఏ పాటి శత్రువైనను ఏపాటులు పెట్టలేరికన్ నా పుణ్య మార్గ రక్షకునకున్ ప్రపూర్ణ ప్రేమ పాడుము.