FaithWalk
← Back to Library

#100All glory, laud, and honour

Author: థియోడాల్ఫ్ ఆఫ్ ఆర్లీస్ (అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్)Translator: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్)Category: సాయంతనారాధన
1.
పాపల హోసన్నా పాటలు పాడిన రీతిగన్ – నృపాలస్తుతి కీర్తులు నీకు జెల్లింతుము – దావీదు పుత్రుకుండ ఇశ్రాయేలు పాలకుడా దేవుని పేర వచ్చు వీరుండా ధన్యాత్మ.
2.
దూత లాకాశమందు – దొడ్డగా గొల్తురు – భూతలమందు సృష్టి – పూజించును నిన్ను – హెబ్రీయుల్ ఖర్జూరపు శాఖల్ చేబూనుచు హెచ్చించి మ్రొక్కినట్లు నిన్ను స్తోత్రింతుము.
3.
నీ శ్రమలకు ముందు, నిన్ గౌరవించి నీ జయమొందు వెనుక మా కీర్తన స్తుతి – అవాతరి స్తుతులు నీవు – అంగీకరించితివి మా కీర్తనంబుగూడ – మన్నన చేయుమింక.