FaithWalk
Back to AELChurch

Liturgy & Worship

AELC Worship

Creeds, liturgies, and worship materials for the Andhra Evangelical Lutheran Church.

అపొస్తలుల విశ్వాస ప్రమాణము

భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను.

ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మవలన గర్భమున ధరింపబడి కన్యయైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడె ననియు, అదృశ్య లోకములోనికి దిగెననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకము కెళ్ళి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడనియు, సజీవులకును, మృతులకును, తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను.

పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీరపునరుత్థానమును, నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్