FaithWalk
← Back to Songs

Song #773

దైవ రాజ్యపు జీవితము ధన్య జీవితము

✍ గోవాడ డేవమణ్‌

Lyrics

పల్లవి: ధన్య జీవిత మరయ రండి - మాన్యుడేసుని జీవిత నుండి - ఘనుడేసు

బోధించెనండి - దివ్యమైన కొండ నుండి ॥ధన్య॥

1. ఆత్మయందు దీనులైన వారలే బహు ధన్యులండి - దైవ రాజ్యము వారిదటంచు

- ప్రభుడు యేసే తెల్పినాడు సుండి॥ధన్య॥

2. పాపపశ్ళాత్తాపంబొంది - పరగ దుఃఖము నొందెడు వారలు - ప్రభుని వలన

నాదరణ నొంది పరమ సంతోషమున చేరెద రండి - ఇల సాత్వికులే ధన్యులండి

దైవ సుతుడు సెలవిచ్చెనండి - నిహ లోకము స్వతంత్రించుకొని ధన్యులై జీవించెద

రండి ॥ధన్య॥

3. నీతి యందు ఆకలి దప్పులను మతిలో కలిగిన విచారముల నుండి - తృప్తి తీర

డీవెనలండి - కీర్తనలతో జీవించెదరండి ధన్య!

4. కనికరము గలవారే ధన్యులు - కనికరమునే పొందుదురండి - కరుణ గల క్రీ

యేసుని వలెనే కనికరమునే చూపుడు రండి ॥ధన్య!

5. శుద్ధ హృదయములు ధన్యలటంచు - శుద్దుడగు శ్రీ యేసుని - సుబుద్ధి తోడ

వారు దేవుని నిత్యము దర్శించెద రండి ॥ధన్య[॥

6. శాంతిని నెలకొల్పెడి వారు - కాంతిగల దేవుని పుత్రులు - కాంతితో దేవుని

'స్వరూపము - నొంది భువిలో పెరుగుచుందురు ॥ధన్య॥

7. నీతి కొరకై హింసలొందెడి - నాయకులే బహు ధన్యులండి - దైవ రాజ్యము

వారిదటంచు - ప్రభువు క్రీస్తే తెల్పెనండి ॥ధన్య!॥

8. నిందలు అబద్ధపు చెడ్డ - వాదులు మీరి - హింసలైన మెండుగా మీ పైబడి

యున్న - దండిగా యానందించండి ॥ధన్య॥

9. ఉప్పుసారము గలిగి మీరు జీవిత మరయ రండి - ఒప్పు మీరా ప్రభుని వలెను

- తప్పకను జీవించ రండి ॥ధన్య॥

10. దీపముల వలె లోకమందు దివ్య వెలుగును చూప రండి దైవ వెలుగే మీ

'యందుండు దివ్యలై ప్రకాశించండి ॥ధన్య॥

11. సత్య జీవిత మరయ రండి - సతియలనే చేయరండి - సుప్రకాశమైన వెలుగు

- లోకమందు చూపరండి ॥ధన్య॥

- గోవాడ డేవమణ్‌

అనుబంధము

Section: 566 అనుబంధము · Book page: 536