FaithWalk
← Back to Songs

Song #771

శత్రువులు - చింతలందు ప్రార్థన

✍ గోవాడ దేవమణి

Lyrics

(డా॥కీ॥3)

పల్లవి:దేవా నను బాధించువారు లేచి యున్నారు - భువి యందు శత్రువులు నను

చుట్టియున్నారు - అవనిలో బహు గేలి సేయుచు నన్ను చాటుచున్నారు. ॥దేవా॥

1.నీవే నాకు కేడముగాను - నా తల నెత్తిన బలశూరుడవని నా - అతిశయ

కారణ భూతుడవని నీ శరణని నమ్మితి కరుణతో ట్రోవవే ॥నా దేవా॥

2. కంఠమెత్తి నే మొరలిడునపుడు - మింట నుండి నాకభయ మిచ్చితివి సందెట

నన్ను చేర్చియుంటివి ఒంటరినై నీ కడ నుండగా ॥నా దేవా॥

3. నేను పండి నిద్రించుచుండగా - వేన వేరు శత్రువులు చుట్టగ నను - పన్నుగా

గాచి నను దీవించితివి - వనయము నిను నే స్తుతియింతును ॥నా దేవా॥

4. వ్యాధులు - బాధలు, శోధనలు బహు - వ్యాకులములు వలు నను

క్రమ్మియుండగా - మేదిన - దయయని నమ్మితిని నన్ను ఆదరమున నీ దయ

చూపించిన ॥నా దేవా॥

5. జనక సుత శుద్ధాత్మకు మహిమయు - ఘనతయు స్తోత్రము నిరతంబును

అనయముగా నీకే చెల్లును - తరములు నీకు మహిమౌ గాక ॥నా దేవా॥

- గోవాడ దేవమణి

Section: 566 అనుబంధము · Book page: 536