Lyrics
1యెహాను 3,4,5 అధ్యాయాలు
ఛాయం :ఏమి జన్మంబు ఏమి జీవనము
పల్లవి: దేవుడే - అవతారుడాయెను - సంపూర్ణ మానవ శిశువుగానే జన్మమాయెను=
దైవ వక్తలు ఏళ్ళ తరబడి దైన రాకను భువికి తెలుపగా - దేవ దూతల గాన
'మూలాకాశ మంగళా హారతులతో॥దేవుదే॥
1. భువిని కన్య మరియాంభ గర్భమున - బెత్తెహేమనెడు దావీదు పట్టణమందున
- పన్నుగా నరపుత్రుడై - యా పశువులశాలలో జన్యమొందెను - పొత్తిగుడ్డల
చుట్టబడియు - పశుల తొట్టెలో పరుండ బడెను ॥దేవుడే॥
2. పాపహరుడై జన్మమెత్తెను - పాపులను బ్రోవ ప్రాణ బలినే చేయవచ్చెను -
ప్రాణ బలిచే తండ్రి (ప్రేమను పుడిమిలో ప్రత్యక్ష పర్చెను - పాప ప్రాయశ్చిత్తమై
తన శాంత ఫలమునే మన కీయవచ్చెను ॥దేవుడే॥
3. సాతాను క్రియలు - మోస కృత్యములు - హతమార్చుటకు యా దివ్య సుతుడుగా
నవతరించెను - భూతములు పిశాచి పీడితులందరిని రక్షింప వచ్చెను -
వాస్తవంబుగా లోకమందు పిశాచినే లయ పర్చవచ్చెను ॥దేవుడే॥
4. జీవమియ్యను జన్మమెత్రెను - సంపూర్ణ జీవము మానవులకు తాను తెచ్చెను -
దైవ జీవమే తానటంచు దృఢముగా సెలవిచ్చియుండెను - దేవ జీవమే మనకు
నియ్య బాల శిశువై జన్మమెత్తెను ॥దేవుడే॥
అనుబంధము 565
5. రక్షకుడుగా నవతరించెను - మన పక్షమున తా శిక్షలన్ని భరింపచ్చెను -
రోగములలో వ్యాధులందు - శోధనలు మరి కీడులందు లెట్టి కాలము నందైన
దండి రక్షకుడై యుండ ॥దేవుడే॥
6. సత్యదేవుని ఎరుగునట్లును - మానవులంతా నిత్య తండ్రిని తెలసుకొనుటకును
= తానే దేవుని రూపమై - తన దివ్య జ్ఞాన వివేకములను బోధలందు మనకు
నిచ్చి - తండ్రి ప్రేమను మనకు చూపను ॥దేవుడే॥
7. దేవుని వాక్యమే శరీరమాయెను - డైవ పరిపూర్ణ తింతే (క్రీస్తు నందే
నివాసమాయెను - దైవ పూర్ణుడైన క్రీస్తుని కృపయు సత్య సంపదలతో ఆత్మ
రూపమందే నిత్య నివాసుడై యుండ వచ్చెను ॥దేవుడే॥
= గోవాడ దేవమణి
Section: 534 అనుబంధము · Book page: 534