FaithWalk
← Back to Songs

Song #602

క్రొత్త వత్సరము

రాగం: రేగుప్తితాళం: అటఛాయ: హలెలూయ యని పాడుడీ✍ గాబవల్లి అంటైయ్యు

Lyrics

రా -రేగుప్తి (చాయ : హలెలూయ యని పాడుడీ) తా-అట

'ఘనదేవ ప్రియ తనయుండా - జగద్రక్షా -వినుతి జేతుము నీ మహిమన్‌ =

'ఘనతరంబుగ - గత సంవత్సర - దినము అన్నిట మాకు నీభువి - ఘనసుఖము

లొనరించి మరి -నూతనపు వత్సర మొసగినందుకు ॥ఘనదేవ॥

1. అధిక (ప్రేమలొసంగుము - యేసు ప్రభు - కుదురుగ నీ వత్సరము =

ప్రధమ దినమున - మమ్ము నందరి - ముదముతో నిచ్చటకుం జేర్చితి -

'ప్రబలమగు సంగీతస్తుతులను - మిగులబొందుము యేసు రక్షక ॥ఘనదేవ॥

2... అంచితముగ నిచ్చటన్‌ - గూడిన సభలో - స్రీలన్‌ బురుషుల బిడ్డలన్‌ =

మంచి మార్గమునుంచి నీ - యత్యంత (ప్రేమతోం గావు మిలను - చంచలులు

గాకుండ నీ కృప - లుంచి మము రక్షించుమో ప్రభు ॥ఘనదేవ॥

3. దీవించు ప్రభుయేసువా - సువార్తికులన్‌ - సావధానముగా భువిలో =

భావమందున నీపదంబుల - సేవ బాగుగం జేయుచున్‌ నీ - జీవజల

వాక్యంబులన్‌ ధర ధీరతనుం బ్రకటింపం జేయుము ॥ఘనదేవ॥

458 విశేష సమయములు

4 పరముండ ధర నీ సభలన్‌ - నూతనముగ - స్థిరపర్చి బలపర్చుము =

'సరసముగ నాశీర్వచనము - ల్విరివిగా నొసంగుచున్‌ నూ - తన సహోదర

ప్రియుల సమితిని - మరియు౭ జేర్చుము నీ సభలలో ॥ఘనదేవ॥

5... కరుణాళ్‌ యీవత్సరము - క్రైస్తవ బడుల - ధరణిబ్రబలం జేయుమా =

సరిగ నుపాధ్యాయులందరి - మరి మరీ దీవించు ప్రభువా - స్థిరముగా

'పరమార్థములు బా - లురకు గరపుచునుండం జేయుము ॥ఘనదేవ॥

6. భాసురంబుగ పరలోక - ప్రకాశుండా - దాసబ్బందములన్‌ గావు = వాసిగా

నరలోకము నని -వాసులగు మీ దాసులందరి - దోషరాసిని ద్రోసి నీ కృప -

జూపుచును రక్షించు మనిశము ॥ఘనదేవ॥।

- గాబవల్లి అంటైయ్యు

Section: క్రైస్తవ యువజనులు · Book page: 426