Song #599
క్రీస్తు అనుగ్రహించు స్వస్థత
Lyrics
రా -మిశ్రమ (చాయ : శరణు జొర్చితి) తా-అది
'పరమ వైద్యుండ భారతీయుల - వ్యాధి బాధల? బాపుమా = పరుల కుపచారం
బొనర్చుట - పరమ విధియని చూపుమా ॥పరమ॥
సంవత్సరాద్యంతములు 455
1. (్రేమతో వైద్యులును దాదులు - పెంపుం బొందంగజేయుమా = గ్రామ
రోగుల గాంచి వారికి - క్షేమమును దయ చేయుమా ॥పరమ॥
2. భరత ఖండము నందు వైద్యపు - బడులను నెలకొల్పుమా = పరంగ నీవే
వైద్య శాలల - బాలనంబు సల్పుమా ॥పరమ॥
3. కుంటి గ్రుద్ది మూ౭గ సాలలం -గూర్మితో దర్శించుమా = యంటు రోగుల
యాశ్రయముల - నంటి పరామర్శించుమా ॥పరమ॥
4. లెక్కలేని గర్భవతుల - యక్కణలను దీర్చుమా = దిక్కు లేని బిడ్డలకు నీ -
దీవెనల సమకూర్చుమా ॥పరమ॥
5. యంత్రశాలల గనులయందు - నలయు వారలం ట్రోవుమా = మంత్ర
తంత్రము లందుః జిక్కు న- మాయకులను గావుమా ॥పరమః
ఈ గ్రామ వైద్య సేవం జేసెడి - ఘనులం బరిపాలించుమా = గ్రామవాసులం
గూల్బు వ్యాధుల - గాంచి నిర్మూలించుమా ॥పరమ॥
7. దురభిమాన మూఢ భక్తిని - ద్వరగ దూర పరచుమా = మరియు శుచిచే
రోగములు మటు - మాయ మగు నని కరపుమా ॥పరమ॥
$8. దేహశుద్ధిని జిత్తకుద్ధిని దేశ జనులకుం గూర్చుమా = దేహములం బర శుద్ధ
మగు నీ - దేవళములుగ మార్చుమా ॥|పరమ॥
= వళ్లెల దావీదు
'సంవత్సరాద్యంతములు
Section: క్రైస్తవ యువజనులు · Book page: 424