Song #597
ఘనమగు పరిశుద్ధులు
Lyrics
రా -కళ్యాణి (చాయ : ఎంతో సుందరమైనవి ) తా -త్రిపుట
ఎంతో ఘనమగువారలు - పరిశుద్ధులు - ఎంతో వినదగువారలు =
సంతసంబుగ వార -త్యంత (ప్రేరణతోడ - సొంతవారిని సవా - సొంతంబుగ
విడచి = చెంతజేరిరి యేసు ప్రభుని - చింతలేకను వెంబడించి - వింత
పనులను జేసి ట్రతికిరి - అంతమువరకును నడచిరి ॥ఎంతో॥
1. పేతు రపోస్తలుండు - అతని సోదరు - డతి ప్రియు డండ్రెయయు = నీతి
నియమములందు - ప్రీతితో బ్రిదుకుచు - చేతి పనులయందు - శ్రద్ధతో
నుండుచు = ఖ్యాతి నొందిన యోహాను - అతని యన్న యాకోబుతోను - ప్రతి
దినంబును కలిసి యుండుచు - భక్తి ప్రభువును వెంబడించిరి ॥ఎంతో॥
సర్వపరిశుద్దుల స్మరణ 458
2. ఆస్తి నిచ్చిన బర్నబా - ఆస్తిపరుడ - పోసలులతో జేరెన్ = స్వస్థబుద్ధి తోడ
- ఆస్తివాడుట యెట్లో - క్రీస్తు సేవకొరకు - ఖర్చు పెట్టుట యెట్లో = వాస్తవముగ
నేర్చినాడు - ఆస్తిగలవారలకు నెల్ల - ప్రస్తుతంపు ఆస్తిపాస్తులు - ప్రభువు
పనికియ్యవలెనని ॥ఎంతో॥
3. సంఘమును హింసించిన - సంఘాభిమాని - సంఘ నాయకుడు పౌలు =
సంఘముల నెన్నిటినో - చక్కగను స్థాపించి - సంఘముల కుత్తరముల్ -
'సమయానుకులముగ = సంఘ కాపరులకును సహా - సరియగు సలహాల
నిచ్చి- సంఘములను ప్రభువు కొరకై స్థాపించి నిలుపలేదా ॥ఎంతో॥
4 కన్యయైన మరియమ్మ - ధన్యురాలు - కన్యలకు తల్లులకున్ను = అన్యులకు
అందరికి - ఆదర్శముగ నుండ - సన్యాసిను లెందరో -స్వామిని సేవించ =
కన్యకలుగ నిలుచువారలు - కఠినవ్రతములతోడ నుండి - ధన్యులగు
పరిశుద్ధులతో - దైవసన్నిధి నుండ జూపెను ॥ఏంతో॥
5. మగదాలయూరి మరియ - మహినినున్న - మగువలలో కెల్లను = భగవంతుడై
నట్టి - ప్రభువు యేసునుజేరి - నగము నెక్మెను తన - సొగసైన మార్చుచే =
సాగి మొదట సమాధికడకు - స్వామిదర్శనమొంది మొదట- చేగవెళ్లి శిష్యులకును
- వెదకి సాక్ష్యమియ్యలేదా ॥1ఎంతో॥
6. మత్తయి మార్కులను వారు - మతమునందు - అతినిష్టగలవారలు = మత్తయి
'యూదులకై తన పుస్తకమును ట్రాసె - మార్కు గూడను తన సు-వార్తనందరి
కిచ్చె = వాస్తవంపు జీవితమును - వరుసగాను గలిగియుండ - క్రీస్తు ప్రభువును
వెంబడించగ - క్రొత్తలోకము జూపగలిగిరి ॥ఎంతో॥
7. చూచననేగాని- నమ్మనని - పేచిపెట్టి నతోమయు = చాచి చేయి చూచి
చక్కగ నమ్మెను - చూడకుందనె లూక - వైద్యుండు నమ్మెను = యీ చొప్పున
వీరలిద్దరు - నీచజనులకెల్లరకు తము - బ్రోచు ప్రభువును జూపుచుందురు -
'బోదిగా ప్రతిదినమునందును ॥ఎంతో॥
8. ప్రభువా నీ పరిశుద్ధుల - ట్రతుకునందు - మా భాగ్యమునున్నదిహా
ప్రభువా వారి బ్రదుకు - ప్రబలమైన సేవ - విభవంగాగని - విజయంబు
గాంచుచు = సభను యే రాణింపజేసి - సఫలముగ సేవించి ట్రతికి -
ప్రభువ వారితో నేలునట్లు - యభయమియ్యు మాకు దేవా ॥ఎంతో॥
- ఇన్ఫర్ జోనర్
Section: క్రైస్తవ యువజనులు · Book page: 422