Lyrics
రా -మోహన తా-ఆది
మనోవిలసితంబౌ - దినంబు - మహిమాన్వితంబు = అనంతజగతీమనోహ
రంబు - ఘనాదిప్రభుయశః ప్రకాశకంబు ॥మనో॥
1. మందమారుతములందము నొసగగ - డెందములకు నానందము నిడగా
= సుందర పక్షుల సుమధురగానము సుభావహంబై శోభించెనుగా ॥మనో॥
2... అరుణభాస్మరుని కిరణాకరము - ధరదిక్తటముల దరిజేరెనుగా = ధరా
వలయమాఖర భానునిచే ధగద్దగీయంబై వెల్లెనుగా ॥మనో॥
3. పులుగిల కిలకిల కలరవములతో - పొందుగ గలసిన భూరి రవంబు =
లలితమనోహరశ్రావ్యమ వినుమా - తలపన్ దానికి కారణమేమో ॥మనో॥
4 రయమున నొలీవ నగంబుగనుమా - రభసయుక్తమగు జనమును గనుమా
= జయంజయంబను జయ ధ్యానంబులు -వియదంతము జనమోగుట వినుమా
॥మనో॥
5. ట్రసన్నవదనుడు - భానుతేజుడు -అసంఖ్యజనగణ పరివృతబలుడు
ప్రసితరాసభాసీనుడు యేసుడు - అసమ శాంతితో - నరుదెంచెనహో ॥మ$
6 జయములు బాడెడు బాల చయముతో - సాల్వికుడై రాసభంబు నెక్కి
జయోత్సవంబుతో సర్వేశ్వరుడు - చనిరాహృదయము సమర్చించె దము ॥మనో॥
-ఇజి ఆనందము
పరిశుద్ధ సిలువ పండుగ
Section: క్రైస్తవ యువజనులు · Book page: 420