Song #593
యేసువ జయముతో యెరుషలేమున
Lyrics
1.యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా
వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా ||యేసువ||
2.మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగఁ బాడగ యో ప్రభువా
అట్టహాసముతో అశ్వము నెక్కడ అణఁకువఁ గార్దభ మెక్కిన ప్రభువా ||యేసువ||
3.పిల్లలు పెద్దలు పలుకేకలతోఁ బలికి నుతించగ యో ప్రభువా
చల్లగ వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా ||యేసువ||
4.కొందరు వారిని తొందరఁ జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా
అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా ||యేసువ||
5.యెరుషలేం కొరకై యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా
యెరుషలేమందున యాలయ మంతను శుభ్రపరచిన యో ప్రభువా ||యేసువ||
6.మా కొఱకై తన ప్రాణము బెట్టిన మాన్యుడవీవె యో ప్రభువా
మా కొరకై ధర మరణము గెల్చిన మహిమ స్వరూపుడ యో ప్రభువా ||యేసువ||
7.మాదు మనస్సును హృదయము నాత్మను నీదిగ గైకొను మో ప్రభువా
సాదర వాక్కులు చక్కఁగఁ బలికియు నాదరించుమము నో ప్రభువా ||యేసువ||
Section: క్రైస్తవ యువజనులు · Book page: 418