FaithWalk
← Back to Songs

Song #589

బైబిలు స్త్రీల సేవ

రాగం: తోడితాళం: రూపకముఛాయ: ఘనదేవుని తనయుండ

Lyrics

రా -తోడి (చాయ : ఘనదేవుని తనయుండ) తా -రూపకము

మన దేశంబున క్రీస్తు - సువార్త వ్యాపించుటకు - మార్గంబు స్తీలంచు -

'మరువకమ్మ - పనిబూని ప్రభుకొరకు - పరదేశంబులయందు - ఘనురాండ్రు

శేయుపనుల్‌ - వినలేదమ్మా? ॥

1. సాటియైనటువంటి - సాయంబవై పతికి - లోటులేకుండ నెపుడు - లోబిడు

మమ్మ = పాటుపడి నీ సుతుల - భయభక్తితో పెంచి - నాటుము మదిలోన

బోధ - నమ్ములమ్మ ॥

2. అన్నపానములందు నలవాటులందు నీ - పన్యులకు మాదిరి - వగుదు.

వమ్మ = నిన్ను నీ పనుల గమ - నించి పరీక్షించు -చున్నవారింట బైట -

నున్నారమ్మః

3. _ ఘనుండౌ దేవుని వాక్య - మును జదివియో వినియో - దిన మేకాంతముగ

ప్రార్థించు మమ్మ = నినువలెను నీ పొరుగు - నెలంతుల ప్రేమింపవలె -

వినుమ దూషింపక దీ - వించు మమ్మ ॥

4 పనులెన్నో నీ కున్న - ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన -

దెల్పుమమ్మ- ఒనరంగా నేండాది - కొక యాత్మనైన నిక = నెనరుతో రక్షింప

నేర్చుకొమ్మ ॥

5. ఎల్లసేవకుల కొర = కెల్లప్పుడు ప్రార్ధింప - తల్లుల సమాజమునకు - చెల్లు

నమ్మ - పల్లెలో శుభవార్త - ప్రభవింపవలెనన్న - తల్లులే మంచి సా -

ధనములమ్మ(॥ = ముళ్లెల దావీదు

విశ్వాస ప్రమాణము

Section: క్రైస్తవ యువజనులు · Book page: 416