Lyrics
రా -హరికాంభోజి తా-ఆది
'సఖులారా సంఘంపు బడి - సంభంబునకు నారుమడి = సుఖజీవమిట
గన్గానుడి - చోద్యంపు కధలను వినుడి ॥సఖులారా॥
1... విద్యార్థులకు బోధంబు - వినుడొజ్జలకు మోదంబు = పద్యాలు కీర్తనంబు
ల్పడయంగ నిదితరుణంబు ॥సఖులారా॥
2. మేలౌ గుటుంబములకు - మితిలేని సంఘములకు = జాల |ప్రదేశంబులకు
- సన్మార్గమొదపు నెలవు ॥సఖులారా॥
3. పసిబిడ్డలను రావించి - పరిష్వంగమును గావించి = వెసంట్రేమతో దీవించి
విభుడంపె నిది భావించి ॥సఖులారా॥
4. ఆబాలగోపాలముగ - నా చంద్ర తారకముగ = బైబిలును యుక్తముగం -
బరియింప దగుంచిత్రముగ ॥సఖులారా॥
5. మన జిహ్వలకు మధురంబు - మన యంటఘ్రలకు దీపంబు = మన చేతులకు
'ఖడ్గంబు - ఘనపావన వేదంబు ॥సఖులారా॥
6. శుభవర్తమానంబు విని - సొంపొంద రక్షణ గని = ప్రభు సంఘమున
జేరుకొని - పరులన్ రక్షించుడి చని ॥సఖులారా॥
7. ధరణిలో బడులూరూర - స్థాపింపబడి పెంపార = బరమాత్ముని మన సారం
- జ్రార్థింతము హితులారా ॥సఖులారా॥
- మళ్లెల దావీదు
Section: క్రైస్తవ యువజనులు · Book page: 414