Lyrics
రా -కమాసు (చాయ : ఇదిగో గొథ్టెలకాపరి) తా-అట
ఆలించు మా ప్రార్థన - మా రక్షకా - యాలించు మా ప్రార్థన = నాలింతు
వని నమ్మి - యాసక్తి వేండెదము - మేలైన దీవెనలు - మెండుగా
గురిపించి।యాలించు॥
1... ఈ సదన మర్పింతుము - మా ప్రియ జనక - నీ సుతుని దివ్యాఖ్యను = నీ
సేవకై మేము - నెనరుచే నొసంగు ని - వాసము గైకొని - వర కరుణచే నిప్పు
॥డాలించు॥
2. ఇందుం గూడెడు భక్తుల - డెందము లనెడు - మందిరంబుల నాత్మచే =
పౌందుగ నివసించి - పూర్ణుండ వగు దేవ - యంద మైన సుగుణ -
'బృందంబుతో నింపి ॥యాలించు॥
3. ఇచ్చట శుభవార్తను - విచ్చల విడిగ - వచ్చి వినెడు పాపులం = జెచ్చెర
రక్షించి - యిచ్చి శుద్ధాత్మను - సచ్చరిత్రులం జేసి - సాంద్ర మగు కరుణచే
॥నాలించు॥
"సమూహములు.
“ముంగిలి.
"సమూహముచేత. _ 'గాయపురక్తమనెడి గొప్ప యౌషదము.
ఆదివారపు బడి 45
4. నభము నేలెడి తండ్రి - యిచ్చోటను - శుభవార్త బోధించెడు = ప్రభు
యేసు సేవకులు - సభకు మాదిరు లగుచు - సభ వృద్ధి నొందింప - శక్తి
వారల కిచ్చి ॥|యాలించు॥
5. చుట్టు నుండెడు నూళ్లలో - శుభ వాక్యంబు - దిట్టముగం బ్రకటింపం గం
= పట్టు గల్లెడివారి = బంపి యిచ్చటనుండి - దట్టమగు నీ ప్రేమం - దగినట్లు
తెలిపించి ॥యాలించు॥
- వలిపాక ఇగన్నాము.
ఆదివారపు బడి
Section: క్రైస్తవ యువజనులు · Book page: 414