FaithWalk
← Back to Songs

Song #586

మందిరార్చణము

రాగం: యదుకులకాంభోజితాళం: నీకంబులె నీఛాయ: పైనమైయున్నాను

Lyrics

రా -యదుకులకాంభోజి (చాయ : పైనమైయున్నాను) తా-అది

యెహోవా నీ మహిమ స్తవము - యేసుని సుందర మందిరము - ఇది

యెంతో నిత్య శుభకరము = సాహసమున క్రై - స్తవాళి తోడను - స్నేహ

మమర నీ - శిష్యులు నిపు డీ - గేహమునకు భ -క్తిని జేరిరి నీ - బాహు

బలము6 గ - న్పడ దీవించుము ॥యెహోవా॥

1. ఆకాశము నీ సింహాసన మగు - నవని నీ యడుగుల పీఠముగ - నమరు

దేవ నీ కెవ్వరు సాటి = నీ కొర కొక మం - దిర మొనరించుట - కీ

"కుంభినిలో - నేరికి శక్యము - ప్రాకటమైనను - నీ “సద్భక్తా - నీకంబులె నీ

- *నికేతనంబులు ॥|యెహోవా॥

2. పరమండలంములం దుండి నీ - కరుణం జల్లి యీ యాలయము - పైని

'సుప్రకాశ మంపవె = తరతరముల క్రై -స్తవ సముదయములు - విరివిగ నీ

మం - దిర భరితములై - చిరకాలము నీ - సేవ యొనర్పను - వరముల

నిమ్మని - “నెరి ట్రార్థింతుము ॥యెహోవా॥

“భూమియందు. “యోగ్యమైన భక్తుల యొక్క సమూహములు. గృహములు. “బాగుగా.

444 విశేష సమయములు

3. అందముగాను నిందులో ని - న్నారాధించు ప్రియభక్తుల - డెందములే నీ

మందిరములు గా = ముందొనరించుచుం - బొందుగ నలు దెస- లందు

నుండు 'నర - బృందంబులు దమ - సందియములు విడి - సద్గతిం బొందుట

కిందురాను నీ - వింక నొనర్పుము ॥యెహోవా॥

4. పతితాత్ములైనట్టి నరుల - పాప రోగాదులకు మందు - వెదకువారి గృహమున

నుండున్‌ = హితవుగ క్రీస్తుం - డీ గృహపతియై - ప్రతి పాపున కును -

'సతతంబును వా -గ్వితతిని బిలుచును - వినయముతోం దన - క్షత రక్త

మహౌ - షధ మిడి ప్రోవను ॥యెహోవా॥

ర్‌. ధారుణిలో దుర్మార్గుల - పేరైన గుడారంబులలోం - జేరియుండు దాని

కంటెను = పేరిమిగల యీ - నీ సద నాంగణ - ద్వారపాలక - త్వము మా

కబ్బిన - భూరి భాగ్య పరి - పూర్ణులమై వి- స్తార శాంతి మది -

సౌఖ్యమొందుదము ॥|యెహోవా॥ - ఫదుషోత్తమ చౌదరి

Section: క్రైస్తవ యువజనులు · Book page: 412