FaithWalk
← Back to Songs

Song #585

ఆలయ ప్రతిష్ట

రాగం: శంకరాభరణముతాళం: ఆదిఛాయ: రండి యుత్సహించి

Lyrics

రా -శంకరాభరణము (చాయ : రండి యుత్సహించి) తా-ఆది

ఈ గుడియందు ప్రవేశింపన్‌ - యేసుని బిలువగ రారండి = ఆయన రానిదె

దీవెనలు - ఆశీర్వాదము లరుదగును ॥ఈ గుడి॥

1. ఆకా శము మన దేవునికి - అత్యున్నత సింహాసనము = పాదములకు యీ

- భూమియును - పీఠముగా నొప్పును సుమ్ము ॥ఈ గుడి॥

2. ఆయన సన్నిధి కాంతియె యీ - అలయమంతట నిండుకొనన్‌ = ఆయన

యాత్మ సహాయమున - ఆరాధనలను జరుపుటకై 1ఈ గుడి॥

ఆలయ ప్రతిష్ట 43

3. నిర్మలమైన సువార్తను బో - ధింపగ సాయము జేయుటకు = బోధకు లైన

సువార్తికుల - బోధను నాటగ జేయుటకు ॥ఈ గుడి॥

4. ప్రార్థన విశ్వాసాయుతమౌ - భక్తిని నేర్చెడి నిలయముగ = భక్తులు దేవుని

సన్నిధిలో - బాగుగ స్థిరపడ జేయుటకు ॥ఈ గుడి॥

5. ఈ పట్టణమున వెలుగుటకు - ఈ ప్రజలందరి రక్షణకు = ఈ గుడి యీ

సభ బలపడుచు - సాగుచు వృద్ధిని జెందుటకు ॥ ఈ గుడి॥

6. బాప్తిస్మము నిర్ధారణలు - ప్రభు భోజన సంస్మారములు = బాగుగ

జరుగుచుండుటకు - భక్తిని పెంపొదించుటకు ॥ఈ గుడి॥

7... తండ్రి కుమార శుద్ధాత్మకు - తావుగ నీ గుడియుండుటకు = త్రేకుని దీవెన

వర్షములు - దీనిపై నిరతము కురియుగాక ॥ఈ గుడి॥

న ఎం రఫాయేలు

Section: క్రైస్తవ యువజనులు · Book page: 412