Lyrics
1.యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో
మహోపకారునకు మానుగ నర్పణ సమర్పించుఁడి ||యెహోవ||
2.ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు
అభయ ప్రధానములు విభునకు నియ్యుఁడు విరివిగను ||యెహోవ||
3.రిక్తహస్తములతో రావలదు సన్నిధికి
భక్తవత్సలునకు శక్తికొలఁది మీ రర్పించుఁడి ||యెహోవ||
4.శృంగారాలయ మీలలోఁ పొంగారఁ గట్టుటకు
బంగారు వెండి యును బాగుగ నియ్యుఁడి ప్రభుపేర ||యెహోవ||
5.వరుమానములచేత వాంఛింప వలదండి
గురు నాజ్ఞ చొప్పునను విరివిగ హృదయము లర్పించుఁడి ||యెహోవ||
6.యెహోవ జనులారా యియ్యుండి మనసార
యెహోవ యిచ్చి నది యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ||
Section: క్రైస్తవ యువజనులు · Book page: 410