Song #581
కోంత యజమానుడు
Lyrics
రా -బిలహరి (చాయ: యేసు నాధ కథా సుధారస మిదిగో) తా -త్రిపుట
కోంత యజమానుండ స్తోత్రముం - గూర్మితో నొనరింతుము = ప్రీతి మోర
గ మాదు పొలములు - పెరిగి పండెను గావునం ॥కోంత॥
1. నీదు సేవకులైన వారలు - నిండు మోదము నొందుచు = నీ దయ నొక
యేటి గ్రాసము - నీ దినంబున గాంతురు ॥కోంత॥
2. విత్తుకాలము కోంతకాలము - విమలమైన తలంపులు = చిత్తమునం బుట్టించి
మాకతి క్షేమ మొసంగితి రక్షకా ॥కోంత॥
3. వేసవిని భువి మేము నాటిన - విత్తనం బతిరమ్యమై = భాసురంబగు పచ్చ
మొక్కయి - బయలువడె నిది చిత్రము ॥కోంత॥
4 జల సమాధిని వెడలి చక్కంగ - బలముతో నీ గింజలు = బలుండు దేవుని
శక్తి చేతను - బాగుగను ఫలియించెను ॥గోంత॥
440 విశేష సమయములు
ర్. ఆ ప్రకారమె నీదు నామము - నందు కాలము చేసి = యా ప్రజలు దేహములు
మహిమను - నందం జేయుము రక్షకా ॥కోంత॥
6. కోంత కార్యమువల్ల గూడను - కూర్మిచే నీ బిడ్డలు = నీతులను నేర్వంగం
జేయుము - ప్రీతిగల మా రక్షకా ॥కోంత॥
7. దూత లంత్య దినంబునందున - కోంత గోయుదు రంతట = నా తరుణ
మున గురుగు లన్నియు - నగ్నిలోం బడవైతురు ॥కోంత॥
8. లోకమందలి గాలి వానల - లోను మే మింక నుండక = నాకమందున
దండ్రి మింటను - నేకముగ జీవింతుము ॥కోంత॥
౨9. నీవు నేర్పిన యట్లే మే మిల - నిన్ను బ్రతిదినమందును = జీవనోపాయంపు
భక్తిని - దేవ, వేండంగం జేయుమో ॥కోంత॥
10. మేఇన నేం బోషించు నన్న - పానములనే చేండక = జానుగా నాత్మలకునౌ
భో - జనము వేండం నీయుమో ॥కోంత॥
11. వసుధ నినుం ట్రార్థించు జన జీ - వంపు రొట్టెవు నీవెగా = అనువు
నాదరణంబు భక్తిని - యగుము మా కిల నెప్పుడున్ ॥గోంత॥
= కడియం గాట్రీయేలు
Section: క్రైస్తవ యువజనులు · Book page: 408