Lyrics
రా -హిందూస్తాని కన్నడ తా - తిశ్రజాతి ఏక
నీ ధనము - నీ ఘనము - ప్రభు యేసుదే - నీ దశమ భాగము నీయ -
వెనుదీతువా ॥
1. ధరలోన ధనధాన్యముల నీయగా - కరుణించి కాపాడి రక్షింపగా పరలోక
నాధుండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా ॥
2... పాడిపంటలు ప్రభువు నీకీయగా - కూడు గుద్దలు నీకు దయచేయగా వేడంగా
ప్రభు యేసు నామంబును - గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ॥
3. వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా!
వెలిగించ ధరపైని ప్రభు నామము - కలిమికొలది ప్రభున కర్పింపవా ॥
4 కలిగించ సకలంబు సమృద్ధిగా - తొలగించె పలుబాధ భరితంబులు
'బలియాయె నీ పాపముల కేసుశే - చెలువంగ ప్రభుకీయ చింతింతువా ॥
- బొంా నమాటేటు
Section: క్రైస్తవ యువజనులు · Book page: 408