Lyrics
రా -కాంభోజి
స్తుతియు మహిమయు నీకె - క్షితికిన్ దివికిన్ నీటి -వితతికిన్ కరవై -చెలయు
మా దేవా = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు- హితుండా మా (ప్రేమ
నీ - కెట్లు చూపుదుము ॥స్తుతియు॥
1. పసిండి వర్ణపు బెండ - భాగ్య ధారల వాన - విసరు మంచి గాలి -
విరియు పుష్పములు = రస మొల్ము పండ్లు నీ- రమ్య (ప్రేమన్ జాటున్ -
ట్రసరించు కో తలో - పల నుందు వీవు ॥స్తుతియు॥
2. నెమ్మదిగల యిండ్లు - నిజసౌఖ్య కాలములు - ఇమ్మహి ఫలియించు -
నైశ్వర్యాధికముల్ = ఇమ్ముగ గలిగిన - హృదయులమై వంద - నమ్ములు
'బుణపడి యు -న్నాము నీకు ॥స్తుతియు॥
3. దురితంబు లొనరించి - దౌర్భాగ్య స్థితి నున్న - ధరణికి నీ పుత్రున్ -
ధర్మంబు జేసి = నరుల కీ ధర్మమున - కొరంత దీర్చెడు సర్వ - వరము
అమర్చిన - పరమోపకారి ॥స్తుతియు॥
4. జీవంబు ప్రేమను - జేవం గల్గించెడు - పావనాత్మను మాకై - పంపితివి =
దీవెన లేడు రె - ట్లావరింపను మమ్ము - నీ విమలాత్మ వా - నిని గుమ్మ
రించు ॥స్తుతియు॥
5. నరులకు విమోచ - నము గల్గె పాపంబుల్ - పరిహార మాయెం గృ -
పాసాధనముల్ = దొరికె మోక్షాంశంబు - స్థిరమాయె మేము నీ - కొరకేమి
తేగలము - పరిపూర్ణ జనకా ॥స్తుతియు॥
6. మాత వాడుకొనెడి - రూకల్ వ్యర్థం బిగును - నీకై యప్పుగ నిచ్చు - నిఖిల
వస్తువులు = శ్రీకరంబగు నిత్య - శ్రేష్ట ధననిధియై పై - లోకంబు నందుండు
- లోపంబు లేక ॥స్తుతియు॥
Section: క్రైస్తవ యువజనులు · Book page: 402