FaithWalk
← Back to Songs

Song #570

దాతృత్వము

రాగం: నవరోజుతాళం: ఆదిఛాయ: యేసుక్రీస్తు దొరికితేను✍ జిజార్‌ తాతయ్య

Lyrics

రా -నవరోజు (చాయ :యేసుక్రీస్తు దొరికితేను)

ఇయ్యుడి మోకియ్యబడునని - ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు = నెయ్యముతో

తన - శిష్యవితతికి - నయముమోర జెప్పినట్లు ॥ఇయ్యుడి॥

1. మొదట పరముని నంతునియ్యరే - సదమల హృదయంబుతోడ = సదయు.

డగు మన పరమతండ్రి - ముదమతోడ నంతయు నిచ్చున్‌ ॥ఇయ్యుడి॥

2. శక్తికొలది నియ్యవలెనని - భక్తులందరితోడ జెప్పె = భక్తితోడ ప్రభుని సేవకు-

శక్తికొలది నియవలెను ॥ఇయ్యుడి॥

432 విశేష సమయములు

3. కొంచెముగ విత్రెడివారు - కొంచెము సమకూర్చెదరు = హెచ్చువిత్తెడి

వారికిలను - హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్‌ 1 ఇయ్యుడి॥

4. సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో ట్రోచున్‌ = వింతగా

దీవెనలతోడ - అంతయు దయచేసి ట్రోచున్‌ ॥ఇయ్యుడి॥

5. యేసు కృపను ఎరిగిమనుడి - యేసు మార్గమునందు నడువుడి= దాసుడై

ధనమంత విడిచె - నీచులకొరకిలను మున్నె ॥ఇయ్యుడి॥

6. పరమనిధులను నింపుకొనుడి - పరమ దేవుని ప్రేమను గనుడి = పరమ

నిధులలో చిమ్మెటుండదు - దొంగలసలే లేరుసుమండి ॥ఇయ్యుడి॥

- జిజార్‌ తాతయ్య

Section: క్రైస్తవ యువజనులు · Book page: 400