FaithWalk
← Back to Songs

Song #548

ఆదర్శుల ననుకరించుట

రాగం: హిందూస్మాని ముఖారితాళం: జుల్వఛాయ: సాక్ష్యమిచ్చెద

Lyrics

రా -హిందూస్మాని ముఖారి (చాయ : సాక్ష్యమిచ్చెద) తా-జుల్వ

అనుకరించెద - నే - ననుదినమును బాలుం డేసు = ననువుగాను జ్ఞానమునం

- దును వయస్సునందును దే - వుని ప్రేమను మానవుల ద - యను జెరిగిన

'బాలుండేను ॥ననుకరించెద॥

1. పరదేశంబున వసించి - పరమాత్తుని మది దలంచి = దురితమును

జయించిన స - చ్చరింతుండైన యోసేపు ॥ననుకరించెద॥

క్రైన్రవ బాలలు 415

2. తల్లి యానతి నెరవేర్చి - తమ్ముని కష్టముల? దీర్చి = యెల్లకాలముండు కీర్తి

= నిల గడించిన మిర్యాము ॥ననుకరించెద॥

3. పాలు మరచినది మొదలు - ప్రభు సేవా సంపదలు = ఆలయమునం

'బూనిన సు - బాలకుండు సమూయేలు ॥ననుకరించెద॥

4 శత్రువులను బరిమార్చి - మిత్రులకు జయంబొనర్చి = స్తోత్రగీతములు

రచించిన - సుందరుండౌ దావీదు ॥ననుకరించెద॥

5. పరులకు న్యాయంబుం దీర్చం - బ్రజలకు క్షేమంబుం గూర్చం = పరమ

వివేకంబుం గోరి - ప్రభు నడిగిన సౌలొమోను ॥ననుకరించెద॥

6. యజమానుని కుష్టు గాంచి - స్వజనుల దేవుని గురించి = నిజ సాక్ష్య

మిడి సన్మా - నించిన హెట్రీయ బాల ॥ననుకరించెద॥

7... అపవిత్ర రాజ భోజ - నాదుల విడి దైవ పూజం = గపట మింత లేక చేసి

= ఘనత నొందిన దానియేలు ॥ననుకరించెద॥

Section: క్రైస్తవ యువజనులు · Book page: 384