FaithWalk
← Back to Songs

Song #542

ధన్యులయిన పిల్లలు

రాగం: ముఖారితాళం: త్రిపుట

Lyrics

రా -ముఖారి తా-త్రిపుట

వారు ధన్యు లైన పిల్లలు - భూలోకమందు - వారు ధన్యులైన పిల్లలు=

కోరి విచారమును ప్రభుని - సార వాక్య మెదను బెట్టి - వారి వారి కితరులైన

- వారికిని విధేయులైన ॥వారు॥

1. అన్నదమ్ములందు నెటులను - తనతోడ నాడు - చున్న యితరులందు

నటులను = భిన్న మెంచ కొక్కరీతి - దన్నుంబోలె ప్రియ మొనర్చి - తిన్నని

బడియందు నేర్చు - చున్నవార లెవ్వరో ॥వారు॥

2... ఒకండె తండ్రి యతండు దేవుండు - మన కందరకును - సకల సుఖములిచ్చు

నెప్పుడు = అకట మన మింకను జగడము - లాడందగదు ప్రభుని రీతి -

నొకని నొకండు ప్రియము చేసి - యుండుద మని తలంచుచుండు ॥వారు॥

3. మంచి మేలు లనుభవింపంగం - గరుణించి దేవుం - డెంచి మనల నిచటం

గూర్చెంగ = వంచనలం ద్యజించి కనిక - రించి యొకనినొకండు మది స -

హించి మంచి క్రియలతో వ - రంప నిశ్చయింతు రెవరో ॥వారు॥

4. ఆకసమున నున్న దేవుండు - మన మనసు రాక - పోక లన్ని చూచు

నెప్పుడు = ఏకముగా హృదయములు వి - వేకమున వెలుంగం జేసి -

ప్రాకాటముగం బ్రభుని యాజ్ఞ - గ్రైకొనియెడి వార లెవరో ॥వారు॥

జాక్‌ హే

Section: క్రైస్తవ యువజనులు · Book page: 384