FaithWalk
← Back to Songs

Song #541

మంచి సమరయ్యుడు

రాగం: శంకరాభరణముతాళం: అదిఛాయ: వినరె మనుజులారా క్రీస్తు డిలనుజేయు✍ జజా్‌ తారయ్య

Lyrics

రా -శంకరాభరణము(చాయ :వినరె మనుజులారా క్రీస్తు డిలనుజేయు) తా-అది

ఒక్క మనుజు - డెరుషలేమునుండి - యెరికొ పట్టణమునకు = ముక్కు

వతో వెడలుచుండె - కొంత ధనముతో ॥ఒక్క!

1. మార్గమందు - దొంగలతని - పట్టికొట్టి దోచుకొనిరి = మూర్చపోవు నట్లు

గొట్టి = విడిచి వెళ్లిరి ॥ ఒక్క!

2. అపుడు నొక్క యాజకుండు - వచ్చి జూచి ప్రక్మగాను = కపటముతో వెళ్లె

వాని నాదరింపక ॥ఒక్క!

3. వెనుక నొక్క లేవింయుండు - వచ్చి జూచి యోర్వలేక = గన్నులారా జూచి

- పోయె గరుణలేకను ॥ఒకృ!

4 పిదప సమరయుండు వచ్చి -బదిలముగను జూచి వాని - నాదరించె

గరుణతోడ - భేదమెంచక ॥ఒక్క।

5. నూనె ద్రాక్షరసము పోసి - గాయములను గట్టి వాని - ఘనమగు

వాహనముమోద - నూరు చేర్చెను ॥ఒక్కః

6. అటువలెను మనము కూడ - కష్టములలో నుండువారి = కష్టములను

జూచి యాదరింపవలయును ॥ఒక్క!

- జజా్‌ తారయ్య

Section: క్రైస్తవ యువజనులు · Book page: 382