FaithWalk
← Back to Songs

Song #532

యేసునకు స్తుతి

రాగం: ముఖారితాళం: ఆదిఛాయ: దినదినమునకు దిక్కు నీవే✍ నరక నమాయేలు సుబ్బయ్య

Lyrics

రా -ముఖారి (చాయ : దినదినమునకు దిక్కు నీవే) తా-ఆది

చేతులెత్తి వందనములు -చేతు మిపుడే యేను నీకు = రాతిరి పగ లందు

'మమ్ముం - బ్రీత్రితోం గాపాడు యేసు ॥చేతు॥

1. సుఖమైనట్టి నిద్ర మమ్ము - నొందంజేసి రాత్రియందు = సకల మేలు లంద

జేయు - స్వామి యేసుక్రీస్తూ నీకుం ॥జేతు॥

2. అన్నవస్త్రములను మాకు - నన్ని వేళలందు నిచ్చి = కన్న తండ్రివలెను

బెంచు - చున్న యేసుస్వామ నీకే ॥చేతు॥

8. విద్యా బుద్ధలన్ని యిచ్చి - వింత వింత వరము లిచ్చి = పెద్దల

దయలోనుమమ్ము- - బెంపారం జేయు మేసయ్యా ॥చేతు॥

4. చిన్నవారి స్నేహితుడుగ - నున్న యేసుస్వామి నీకు = ఎన్నో వేల స్తోత్రంబులు

- నిలలో నెపుడు కలుగుగాక ॥చేతు॥

= నరక నమాయేలు సుబ్బయ్య

Section: క్రైస్తవ యువజనులు · Book page: 378