FaithWalk
← Back to Songs

Song #526

యేసువలె జీవించుట

రాగం: ముఖారి✍ బొండా నరానియేలు

Lyrics

రా -ముఖారి

యేసువలెను - ఇల నేనుండెదను - యేసువలెను ॥

1. శుద్దుడనై బ్రతుకు - బద్దుడనంచును = శుద్ధుడనై యుండ - శ్రద్ధ జూపుదు

నేను ॥యేసువలెను॥

2. భరియింపవలసిన భారంబుల్గల వెన్నొ = భరియింప మిక్కిలి బలశాలినై

నేను ॥యేసువలెను॥

3. సాధింపవలెనెన్నొ - సాహసకార్యంబుల్‌ = సాధింపధైర్యాన - సాగి పోవుదు

నేను ॥యేసువలెను॥

4. ధాత్రి నెల్లరతోడ - మైత్రినేనెరపుచు = శత్రులకునుగూడ - మిత్రు డనై

నేను ॥యేసు వలెను॥

5. ఒరుల చింతలదీర్తు - నుల్లాసమున గూర్తు = పరమ ప్రేమతో నెప్పుడు -

పైకి జూతును నేను ॥యేసువలెను॥

6 నా దివ్యజనకుడు - నాకు ననుదినమును = బోధింప వాక్యంబు బుద్ధితో

నేర్తును ॥యేసువలెను॥

7. వినిసంతసంబున - ఘనుని యాజ్ఞలనెల్ల = వెనువెంట జేసెద - వినయంబున

నేను ॥యేసువలెను॥

(చాయ : యేసు కరుణ) కా-అట

- మీవిజయ చార్లెస్‌

406 కైపన యవనులు

527 యువజనులకు క్రీస్తు ఆహ్వానము

ఓ క్రైస్తవ యువకా - నిజమంతయు గనుమా = నీ బ్రతుకంత మారుటె

మేలు - కోరుము జీవమునే ॥ఓ॥

1. పాపపు చీకటి - బ్రతుకేలా - శాపపు భారము నీకేలా = పావన ప్రభుని

పాదము జేరిన - జీవము నీకగుగా ॥ఓ॥

2. భయపడి వెనుకకు పరుగిడక - బలమగు వైరిని గెలిచెదవా = బలుడగు

(ప్రభుని వాక్యము నమ్మిన - గెలుపే నీదగుగా 1ఓ॥

3. మారిన జీవిత తీరులలో - మానుగ నీ ప్రభుసేవకురా = మహిమ కిరీటం

మన ప్రభు సేవలో - ఘనముగ నీకగుగా ॥ఓ॥

= బొండా నరానియేలు

Section: క్రైస్తవ యువజనులు · Book page: 374