FaithWalk
← Back to Songs

Song #524

క్రైస్తవ యువజనులారా క్రీస్తు కొరకు నిలువండి

రాగం: జేహాగ్‌తాళం: ఆది✍ వెట్టి భానుమూర్తి

Lyrics

రా -జేహాగ్‌ తా-ఆది

భారత క్రైస్తవ - యువజనులారా - ప్రభుకై నిలువండీ - భారతరక్షక -

భటవరులారా - ప్రభువును జూపుటకై లెండి - ఫలితము గనరండీ ॥భారత॥

'బాలప్రాయమున మోరలెల్ల - భక్తి జీవితాసక్తిపరులై - అలయోసేపును

బోలినవారై - బలతర సామర్థ్యము జూపి - ఫలితముగనరండీ ॥భారత॥

2. శోధనాధికము చుట్టునున్న - సకల యాశలును - నెట్టుచున్న - బాధించుచు

మరి సాధించెడి యా - సైతానుని గెలువగ లెండి - ఫలితము గనరండీ

॥భారత॥

క. నమ్మకంబు మదియందు బూని - నేర్చుతోడ ప్రభు సేవజేయ - రమ్మిదె

యేసుని రక్షణ సేవకు - రాజితమగు - జీవమునొందన్‌ - ఫలితము గనరండీ

॥భారత॥।

4. విజయ కాంక్షగలవారలెల్ల - వినయ భూషణాసక్తిపరులై - నిజమగు క్రైస్తవ

నీతిని జూపి - నిరతముగ వెలుగుదు రండీ - నిజమిది గనుగొనుడీ ॥భారత॥

= వెట్టి భానుమూర్తి

Section: క్రైస్తవ యువజనులు · Book page: 374