Lyrics
రా -భూపాలము తా-ఆట
మేలుకొని యిక లేచి యేసుని -మేలులన్ వేనోళ్ల బాడరే = బాలబాలికలారా
చాలా పాడరే - వేలపాడరే ॥మేలు॥
1. పక్షి గణములు కూడి దేవుని - (ప్రేమ నెల్లను పొగడుచున్నవి = బాపహరుడగు
క్రీస్తు చెంతకు - పారుమా - రక్షణ కోరుమా ॥మేలు॥
కైసవ యువజనులు 403
2. అరుణరాగము వెల్లి విరిసెను - ఆకసంబున - జుక్కలణగెను = తరుణ
ముననే లేచి దేవుని కెబగుమా - దీవెన కరుగుమా ॥మేలు॥
3... తెల్లవారెను లోకమెల్లను - తెలివిగొని మున్ముందు దేవుని = తల్లి దండ్రియు
- గురుడవీవని దలచుచూ - తగధ్యానించుమా ॥మేలు॥
4. జగములెల్లను జంతుజాలము - ల గణితంబగు జీవులెల్లను = సొగసున
న్వేనోళ్ల బొగడుట జూడుమా - నీవును పాడుమా ॥మేలు॥
5. నీతి భాస్మరుడుదయమాయెను - నూతనోజ్జీవన మొసంగను = సతత మాతని
దాపున న్వసియించుమా - తగ జీవించుమా ॥మేలు॥
- చెట్టి భానుమూర్తి
Section: క్రైస్తవ యువజనులు · Book page: 372