Lyrics
రా -యమునా కళ్యాణి
యేసుతో రీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు వైరి గెల్వను - యుద్ధనాదంబుతో
బోదము ॥యేసుతో॥
1. రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్య సేవచేయను = యేసు రాజు
ముందుగా ధ్వజము బట్టి నడువగా - యేసుతో రీవిగాను వెడలను ॥యేసుతో॥
2. విశ్వాస కవచమును ధరించుచు - ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు =
అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై - యేసుతో ఠీవిగాను వెడలను
॥యేసుతో॥
3. శోధనలు మనల చుట్టివచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా =
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము - యేసుతో శీవిగాను
వెడలను ॥యేసుతో॥
4. ఓయువతి యువకులారా చేరుడి - శ్రీ యేసురాజు వార్త చాటుడి = లోకమంత
యేకమై యేసునాధు గొల్వను - సాధనంబెవరు నీవు నేనెగా ॥యేసుతో॥
సి కిర్సింగడ్
= వడి చభామణి
Section: క్రైస్తవ యువజనులు · Book page: 372