FaithWalk
← Back to Songs

Song #520

క్రైస్తవ గృహము

రాగం: శంకారాభరణముతాళం: త్రిపుటఛాయ: ఎందుకు మరచితివి

Lyrics

రా -శంకారాభరణము (చాయ : ఎందుకు మరచితివి) తా-త్రిపుట

ఎంతో రమ్యంబైనది భూతలమందు - ఎంతో మాన్యంబైనది = చెంత జేరి

యేసు వింత పాదాబ్ఞముల - సంతసంబున పూజసల్బు క్రైస్తవ గృహము ॥ఎంతో॥

1. పిల్ల లొలీవ మొక్కలై - బల్లల చుట్టు - ఎల్లప్పుడు ఆడుచున్‌ = నుల్లమందున

యేసు చల్లని వాక్యంబున్‌ - నెల్ల వేళల దలచి నుండుచుండెడి గృహము ॥ఎంతో॥

2... తల్లిదండ్రు లైక్యత - దనరుచునుండి - దాక్షిణ్య నిధుల జిల్కి = ఎల్ల ప్రేమామృత

మెల్ల వారల కొసగి - కల్లోలములు వీడి - నుల్లసిల్లెడి గృహము ॥ఎంతో॥

3. పొరుగువారల మైత్రిని - పొందుగ గోరి - పొలుపారు నీతిన్‌ దనరు =

నురుతరనాత్మ వరముల పై

గురిపించు- వరదాత యేసున్‌ - ప్రార్థించు

క్రైస్తవ గృహము ॥ఎంతో॥

4 శోధనల నన్నింటిని సర్వదా పైచి - శోభిల్లు విశ్వాసమున్‌ - మోద మొందగ

యేసునాధు నందున నిల్చి సాదరంబుగ సాక్ష్యమిడెడు క్రైస్తవ గృహము ॥ఎంతో॥

5. వ్యర్థ ఖర్చుల మానుచు- వర్ధిల్లు కొలది సర్దుకొని జీవించుచున్‌ = వృద్ధి

నొందెడు వేళ శ్రద్ధాభక్తులతో డా - ఇద్ధరిత్రిని దశమభాగ మొసగెడు గృపము

॥ఎంతో॥

- ఎంఆనందము

క్రైస్తవ యువజనులు

Section: 394 క్రైస్తవ జీవితము · Book page: 370