FaithWalk
← Back to Songs

Song #518

క్రైస్తవుని ప్రతిజ్ఞ

రాగం: యమునా కళ్యాణితాళం: త్రిపుటఛాయ: జీవితాంతమువరకు✍ చి రాజన్‌ కరియర్‌

Lyrics

రా -యమునా కళ్యాణి (చాయ : జీవితాంతమువరకు) తా-త్రిపుట

నేనును నా యింటివారును - నీతి సూర్యుని గొలుతుము = దీనమనసును

గలిగి దేవుని - దివ్యసేవను జేతుము ॥

1. అనుదినంబును - ప్రభుని దలచుచు - అలయకను ప్రార్థింతుము = అనవరత

మా ప్రభుని చిత్తము - ననుకరింతుము పనులలో ॥

2. వేదవాక్య పఠనమందు - విసుగు - జెందక నుందుము = ఆదరంబున

దైవ చిత్తము - ననుసరించుచు నడుతుము ॥

3. ఆశతోడను ప్రభుని దినమును - నాచరింతుము మరువక = విసుకు జెందక

నాలయమునకు - పిన్న పెద్దల దెత్తుము ॥|

400 క్రైప్రవ కుటుంబము

4 సంఘ కార్యక్రమములందు - సహకరింతుము ప్రతీతో = భంగ పరచెడి

పనులన్నిటి - కృంగదీసెదమనిశము ॥

ర్‌. ప్రేమతోడను పొరుగువారిని - ప్రియులుగను భావింతుము = క్షమయు

స్నేహము నేర్చి ప్రభుకడ - శాంతితో జీవింతుము ॥

6. శక్తిగొలది శరీరబలమును - (శ్రమను క్రీస్తుకు నిత్తుము = భక్తితో

హృదయమును పూర్తిగ - ప్రభునికే యర్చింతుము ॥

7. చిన్నవారలు దైవరాజ్యపు - చిజుత వారసులంచును = అన్నివేళల వారి

వృద్ధికి - మిన్నగ దోడ్పడెదము ॥

8... పెద్దవారలు దైవజనులని - ేర్మితో భావింతుము = శుద్ధుడగు ప్రభు క్రీస్తు

మనసును - థ్రద్ధతోడను జూపుచు ॥|

9. జీవితంబున ప్రభుని (ప్రేమా - శ్యీసులను ప్రసరింతుము = దివ్యజ్యోతుల

రీతి వెలుగుచు - దివ్యసన్నిధి నుందుము ॥

-చి రాజన్‌ కరియర్‌

Section: 394 క్రైస్తవ జీవితము · Book page: 368