Lyrics
రా -బిలహరి (చాయ : యేసునాధ కథా సుధారసము) తా-త్రిపుట
యేసుక్రీస్తుని దాసులారా - మో సుతులకును నేర్చర = ఆశతో యెహోవ
యాజ్ఞల - నభ్యసింపగ జేయరే ॥యేసు॥
1. పీల్లలెప్పుడు ననుసరింతురు - తల్లిదండ్రుల నడతలన్ = ఎల్ల విషయము
'లందు మాదిరి - పిల్లలకు గనుపర్చరే ॥యేసు॥
2. మోదమిచ్చు కుటుంబ ప్రార్థన - నేదినంబును మానక = ఆదివారపు బడికి
బిడ్డల - నాదరముతో బంపరే ॥యేసు॥
3. యేసునాధుని బోలు నాయకు - డే జగంబున లేడని = యేసు కే నిజ
శిష్యులగుటకు - నేర్చరే యౌవనులకు ॥యేసు॥
క్రైస్రవ కుటుంబము 399
4 యేసు సౌశీల్యమును వారికి - వాసిగా బోధింపరే = పసితనముననె వారి
హృదయము - యేసురూపము దాల్బును ॥యేసు॥
5. యేసుక్రీస్తులొ నిలిచి వారలు - యేపుమోర ఫలింపగా = యేసు వాక్యము
వారి యెదలలో - నాశతోడను నాటరే ॥యేసు॥ మమియ ాలైస్
Section: 394 క్రైస్తవ జీవితము · Book page: 368