Song #515
క్రీస్తును గృహమున ప్రతిష్టించుట
Lyrics
రా-శహన (చాయ : విజయగీతముల్ పాడరె) తా-త్రిపుట
'ప్రభువుగన్ ప్రతిష్టింపరే - గృహమున క్రీస్తున్ - ప్రభువుగా ప్రతిష్టింపరె =
విభవమొందగ నతని - శుభమౌ నామము ధర సౌ - రభమును వెదజల్లగ -
ప్రబలమౌ ప్రేమన్ - ప్రభుని యెడ గనపర్బరె ॥ప్రభువు॥
1. పూర్ణ (ప్రేమను జూపరే - గృహమున క్రీస్తుకు - పూర్ణ (ప్రేమను జూపరే =
పూర్ణ హృదయముతోను - పూర్ణయాత్మతో - మరి ప్ర - పూర్ణ శక్తితో జూపరే
= డ్రీస్తునిలో సం -పూర్ణులగుటకు సాగరె ॥ప్రభువు॥
2. భక్తితోడను గొల్వరే - గృహమున క్రీస్తున్ - భక్తితోడను గొల్వరే = ముక్తినాధుడు
తన స్వ - రక్తమియను మనకై - రిక్తుడాయెను జూడరే - ముక్తిదాతను నా -
సక్తితో గొనియాడరే ॥ప్రభువు॥
3. నమ్మకస్థులై యుండరే - గృహమున క్రీస్తుకు - నమ్మకస్థులై యుండరే =
అమ్మహాత్ముని నామ - మిమ్మహిన్ దగజాటన్ - నమ్మె మిమ్మును జూడరె -
'సమ్మతిన్ గ్రీస్తున్ - నమ్మకంబుగ జాటరె ॥ప్రభువు॥
= మయ కక
Section: 394 క్రైస్తవ జీవితము · Book page: 368