FaithWalk
← Back to Songs

Song #509

పరలోక వర్ణన

రాగం: శహనతాళం: చాపుఛాయ: మన మొదటి తల్లిదండ్రుల్‌✍ చదలవాడ జకర్యా

Lyrics

రా -శహన (చాయ : మన మొదటి తల్లిదండ్రుల్‌) తా-చాపు

చక్కని పరలోక - సంబంధులతో గూడి - సంతోషించుట యెన్నడో =

మిక్కిలి ప్రియమైన - తండ్రి దేవుని యెదుట - మొక్కి పాడుట యెన్నదో॥చక్కని॥

1. నిత్యమ్ము విలసిల్లు - నిజరతృప్రునాదు - ల త్యుత్తమ పురమున = ముత్యాల

చ్వారముల - ముదముతో బోవుచు - నృత్యమెప్పుడు చేతుమో ॥చక్కని॥

2... పన్నెండు ద్వారముల - పరమపురమును నా - కన్నుజూచుట యెన్నదో=చెన్ను

'మోరంగ - భక్తశ్రేష్ణులతోంగూడి -సన్నుతించుట యెన్నడో ॥చక్మని॥

3... పరిశుద్ధదూతలతోం - ప్రభుయేసు మరల యీ - ధరకేతెంచుట యెన్నడో

= పరిపూర్ణులతోం గూడి - బహుమానమును బొంది - మురియు చుండుట

యెన్ఫదో ॥చక్కని॥

4 మహిమకిరీటము - ధరియించియున్న యా - మహితు నిగను

టెన్నదో=అహహా యా ప్రభునితో - మహిమపరచబడి -మహికేతెంచుట యెన్నడో

॥చక్షని॥

5. పాపశరీరముం బాసి - ప్రభుని యొక్క - రూపునొందుటయెన్నదో = పాప

మరణ దుయఖ - మో యాపదల కెడ - బాపు నొందుట యెన్నడో ॥చక్మని॥

6 రమ్మురమ్ము యేసు - మమ్ము నీ పురముకౌని - పొమ్ము వేవేగమునే =

ఇమ్మహికష్టములనుండి - నెమ్మది ని - త్యమ్ము నిమ్ము వేగమే ॥చక్మని॥

- చదలవాడ జకర్యా

Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 362