Song #505
మోక్ష నివాసము
Lyrics
రా -అసావేరి (చాయ : ఇప్పటి నరులారా) తా-త్రిపుట
పరిశుద్ధం పరిశుద్ధం - పరిశుద్ధం బయిన యా = పరమ కానానున -
కరుగున దెపుదో ॥పరెశుద్ధం॥
1. పరిశుద్ధమయిన యా - యెరుషలేము పురము - వర పద్మరాగంపు - స్టిర
పునాదులతోడ = పరిఢవిల్లు సువర్ణ ప్రహరియు గోడలు - నురురత్న - ద్వారంబు
- లదిరిగ గల వహహ ॥పరిశుద్ధం॥
"వక్ళగా, “ప్రకాశములు ఇచ్చు. జైని. “బాగుగా. “ఆకులు. చక్కగా. లెస్సగా,
“నిశ్యము. “ప్రాీన
"సూర్యుడు. ేచంద్రుయడు. శాంతి. శాశ్వతముగా."
గస్తోతములతో నిండినది. “భాగ్యముగలది. _ “ప్రకాశమానమైన.
శాంతి.
390 క్రైన్రవ జీవితము
2. ఆ నీతిపురమున - నాకాశమున వెల్లు - భానుండు శశి కానం - బడం
బోవు దేదీప్య = మానంబై విలసిల్లు - మానిత గొట్టియ - దానికి జ్యోతియె
తనరుచుండు నహహ ॥పరిశుద్ధం॥
3. శృంగారమైనట్టి - బంగారు వీధులలో - చెంగు చెంగున దాంటు - శ్రేష్ట
సమయంబున = మంగళ ప్రదమైన - మహిమ రాజ్యమునందు - రంగైన
ప్రభుయేసు - రాజున్ దర్శింతును ॥పరిశుద్దం॥
4. తళతళ మెబుసెడు - ధవళంపు టంగీలు - కళ లీనుచుండంగ - గాళ్లార
ధరియించి = భళిర భళిర యంచు - భక్తాళితో నెపుడు - నెళవుగా నుందుము
- నిజ రక్షకుని చెంత ॥పరిశుద్ధం॥
5. భూరి వీణెలు చేత - బొల్పుగ ధరియించి - సారెకు మిటుచు - సంగీత
ములు బాడి = శ్రీ రాజా నీకు జో - హారంచు ప్రభు యేసు -పేరం గీర్తింతురు
- ప్రియ భక్తులందు ॥పరిశుద్ధం॥
6. కరములు జోడించి - శిరముల్ క్రిందికి వంచి - వరపీటమును జుట్టి -
తిరుగు దూతలంగూడి = పరిశుద్ధం పరిశుద్ధం - పరిశుద్దమని నేను - పరమ
'సంగీతంబు - బాడుచుండెద నాహా ॥పరిశుద్ధం॥
-తూబారి కొర్చేలియన్
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 358