Lyrics
రా -బిలహరి తా-అట
పదరే సోదరులార - పంమపురింజేర - మధుర జీవాధార - పదవిచేకూర
= తుది మొదలును ఆపద - రేబగలు లేని - సదనంబునకు జేర - సదయు
డేసునిం గూడి ॥పదరే॥
1... ఎన్ని దినములు బ్రతుక - నేమి సౌఖ్యంబు - అన్ని విధముల జూడ -నధిక
కష్టంబు = కన్ను మూసిన నాండు - మన్ను పాలొదుము - మున్ను జాగ్రత్తనొంద-
కున్న నష్టము గల్లు!
2. ధరణి బ్రతుకును గోర - మరణ భయంబు - దరిలేని చింతల - దగిలి
నిత్యంబు = పరి పరి విధముల - పరుగు లెత్తుట లేల - నిరతంబును సువార్త
= సరణిం గన్గొని వడిగం ॥బదరే॥
॥బదరే॥
3. ధనము సంపాదించి - ఘన మదిక మున్న - తనువే సతము గాదు - అను
భవము సున్న = ఇనుం డెంద మావు-లను గోర నేపాటి - తనివి దీరు నిచ్చో-
టను నా పాటే దీరుం ॥|బదరే॥
4 పరలోక మార్గం - బిరుకై గన్పడును జొరగా సంకటములు - నెరిజుట్టుకొనును
= పరమ జనకుని కృపా - వరము తోడుగ నున్న - వెరపు నొంద మింక -
సరకు సేయుము పద ॥బదరే॥
5. ఇహ స్నేమముల మన - కింకంజాలుం జాలు - బహు దినంబులు సేయం6
- బడె నేమి మేలు = మహిమ దూతల స్నేహ - మమరు నచ్చట - మనకు
అహహా యేసుని జూడ - నధిక సంతోషంబు ॥పదరే॥
6& మనల తోడ్మొని పోవ - ఘనుండు యెహోవా - యనంబు తన శుద్ధా -
శ్మను నిచ్చి కావ = నెనలేని యడ్దంకు - లను దాంటింపను గృప - గనుపర్చి
తోడుగ - నునిచె వేగము గూడి ॥పదరే॥
7. భక్తులై యున్నట్టి - బంధు మిత్రాడుల - రక్తి గుణముతో - రంజిల్లం
గనినన్ = ముక్తి రాజ్యంబుల - మురువుతోడ సర్వ - శక్తుని మహిమ నా -
సక్తితోం జూతము ॥పదరే॥
- విలియం దానన్
Section: 370 క్రైస్తవ జీవితము · Book page: 340