Lyrics
రా -ఆనందబైరవి (చాయ : వారు భాగ్యవంతులు) తా-అట
వారె మంచి క్రైస్తవులు గదా - యీ లోకమందు - వారె మంచి క్రైస్తవులు
గదా చేరునట్లు చేయుడి. = పారమార్థమైన క్రీస్తు - సారవాక్య మనుభవించు
- వారి దారి గోరి జేరి - భూరిసుఖముం బడయునట్టి ॥వారె మంచి॥
1. కపట వేష భాష లెల్లను - తొలంగం ట్రోచి - విపుల భక్తి నిపుణు లగుచును=
'లపితములు నసత్యములును - శపధములును లేక దేవ - కృప మనంబులోన
వెలిగి - యుపరిభాగ మరయునట్టి ॥వారె మంచి॥
2. నమ్మకంబు సుస్టిరంబుగా - మనంబులోన - సమ్మతంబు గలిగి మెండుగా
క్రమ్ము కొనెడి ్రమలయందు - సొమ్మసిలక ప్రభుని పా - దమ్ములందు
'బుద్ధి నిలిపి - నెమ్మది గలవార లెవరో ॥వారె మంచి॥
Section: 366 క్రైస్తవ జీవితము · Book page: 336