FaithWalk
← Back to Songs

Song #474

యేసుకొరకే జీవింతును

రాగం: ముఖారితాళం: ఆది✍ రావి జాన్‌ సుందరావు

Lyrics

రా-ముఖారి తా-ఆది

యేనుని కొరకై యిల జీవించెద - భానురముగ నే ననుదినము =

దోసములన్నియు బాపెను మోక్ష - ని వాసమున ప్రభు జేర్చునుగా ॥యేసుని॥

1. నాశనకరమగు గుంటలోనుండియు - మోసకరంబగు యూబినుండి = నాశచే

నిలపై కెత్తెను నన్ను పి - శాచి పథంబున దొలగించెన్‌ ॥యేసుని॥

2. పలువిధముల పాపంబును జేసితి - వలదని ద్రోసితి వాక్యమును - కలుషము

బాపెను కరుణను బిలిచెను - సిలువలో నన్నాకర్షించెను ॥యేసుని॥

3. అలయక సొలయక సాగిపోదును - వెలయగ నా ప్రభు మార్గములన్‌ =

కలిగెను నెమ్మది కలువరిగిరిలో - విలువగు రక్తము చిందించిన ప్రభు ॥యేసుని॥

4 శోధన బాధలు శ్రమలిల కల్గిన - అదుకొనును నా ప్రభువనిశం = వ్యాధులు

లేములు మరణము వచ్చిన - నాధుడే నా నిరీక్షణగున్‌ ॥యేసుని॥

5. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు -గుప్తమై యున్నవి - ప్రభునందు = అద్భుతముగ

ప్రభు - వన్నియునొసగి -దిద్దును నా బ్రతుకంతటిని ॥యేసుని॥

6. అర్పించెను దన ప్రాణమునాకై - రక్షించెను నా ప్రియ ప్రభువు= అర్చింతును

నా యావజ్జీవము - రక్షకు డేసుని సేవింప ॥యేసుని॥

7. ప్రభునందానందింతును నిరతము - ప్రార్థన విజ్ఞాపనములతో = విభుడే

దీర్చునుయిలనా చింతలు - అభయముతో స్తుతియింతు ప్రభున్‌ ॥యేసుని॥

8& యౌవన జనమా - యిదియే సమయము యేసుని చాటను రారండి= పావన

నామము - పరిశుద్ధ నామము - జీవపు మార్గము - ప్రచురింపన్‌ ॥యేసుని॥

-రావి జాన్‌ సుందరావు

Section: 358 క్రైస్తవ జీవితము · Book page: 334