FaithWalk
← Back to Songs

Song #463

సువార్త సేవాభారము

రాగం: ఆనందభైరవితాళం: త్రిపుటఛాయ: ఎంతో సుందరమైనవి✍ కేసానవల్లి అట్రవోము

Lyrics

రా -ఆనందభైరవి (చాయ : ఎంతో సుందరమైనవి) తా-త్రిపుట

భారమైనది సేవ - మరణము కన్న - భారమైనది సేవ = ఘోరనరకప్పు

దారి - చేరి నడచెడివారిన్‌ జేరి వారితో - సంప్రదించి ప్రభువును చూపి -

'ఘోరనరకపు బాధలన్నియు - కూర్మితో వినజెప్పి - మోక్షపు - దారికిని -

నడిపించి - యేసుని - దాపునకు నడిపించుదారి ॥

1. దురితదుర్గతి నశియించు వారినిజూచి - పరితాప - మొందవలయున్‌ =

మారమనసు నొంది - చేరి ప్రభునితో కలిసి - ఘోరపాపిని నేనని - వేడి -

సిలువ ధ్యానించి = దురితములను - చేయనని తీర్మానములను చేసికొని -

రక్షింపబడినది గురుతుగ సాక్ష్యంబునిచ్చుటయే దారి ॥

2... ప్రథమ దశభాగంబుల - ప్రభునకు నిచ్చి - ప్రతిదినము ప్రార్ధింప వలెన్‌ =

అధములగు - బీదలకు నాధారముల నొసగి -విధిగ భక్తుల - నాదరించి -

సవరించి = ప్రభువు వాక్యము - చదువుకొనుచు - ప్రభుని పాటలు పాడుకొనుచు

- ప్రభుని వేదము ప్రచురపరచి - పదిలముగ - జీవించకోరి ॥

3. దేశదేశముల తిరిగి - దేవుని వాక్యము - దేశప్రజలకు చాటవలెన్‌ =

ఆశాదురాశలను - కోసివేసి యేసు - దాసులను జేసి - వెలిగించి తిలకించి =

యేసుభక్తుల పదిలపరచి యేసుతో - పరిచయము చేసి - యేసును ధరియింప

జేసి - యేసుతో నివసించుదారి ॥

- కేసానవల్లి అట్రవోము

Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 326