FaithWalk
← Back to Songs

Song #457

క్రీస్తు కొరకు సేవ

రాగం: ఖరహరప్రియతాళం: ఆదిఛాయ: ప్రభువా పంపుమా✍ బునమల్ల బెంజమిన్‌

Lyrics

రా -ఖరహరప్రియ (చాయ : ప్రభువా పంపుమా) తా-ఆది

శ్రీ యేసుని వేండు - మనసా - సేవింపవే నేండు = నీ యఘములను

'బాపియు నిను నెడ - బాయక కడు సహాయము జేసెడి ॥శ్రీ యేసు॥

1. పాపంబులు వీడి - పశ్చా - త్తాపబంబును గూడి - దాపున జేరుము -

దయగల ప్రభువు నీ - పాపము బాపియుం పాలించును ధర ॥శ్రీ యేసు॥

2. దేవుని మరువకుము - దైవ - సేవను మరువకుము = జీవపుం త్రోవను -

స్థిరముగ నడువను - పావన మనసును - (బ్రాపుగ నిచ్చెడి ॥శ్రీ యేసు॥

3. రక్తము చిందించెం - ప్రభువు - రక్తితో నీ కొరకు = రక్తపు టూటల -

శక్తిని నమ్మిన - ముక్తి కలుగును - భక్తితో నీవు ॥శ్రీ యేసు॥

4 సిలువయే నీ ఘనము - క్రీస్తు - సిలువయే నీ ధనము = సిలువయే

భాగ్యము - తులువల కెల్లను -సిలువ వలననే -కలుగును రక్షణ ॥శ్రీ యేసు॥

= బునమల్ల బెంజమిన్‌

Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 322