FaithWalk
← Back to Songs

Song #451

సర్వ చిత్తంబు నీదేనయ్యా

రాగం: శంకరాభరణంతాళం: ఆది

Lyrics

సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే (2)

సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా

సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు||

ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)

పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా

పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు||

నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)

నీఛమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ

నిజమైన సర్వ శక్తుండవే నీ చేత పట్టి నన్ రక్షింపుమా ||సర్వ చిత్తంబు||

ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమున (2)

అధికంబుగా నన్ నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షకా

అందరు నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ చిత్తంబు||

Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 318