FaithWalk
← Back to Songs

Song #447

సమర్పణ

రాగం: యమునాకళ్యాణితాళం: అట

Lyrics

రా -యమునాకళ్యాణి తా-అట

సృష్టిపితా - సర్వోన్నతా = సమర్చింతున్‌ = సర్వస్వమున్‌

1. భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే -

బలశౌర్యములు నీవే ॥సృష్టి॥

సమర్పణ 347

2... మావెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే = మా దేహముల్‌ -

మా గేహముల్‌ మా జీవితము నీవే ॥సృష్టి॥

3. వెలలేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు = వివిధంబులైన

దీవెనలు - నీ కరుణా వర్షములు ॥స్ఫృష్టి॥

4. పరిశుద్ధ గ్రంథపు పలుకులు - పరలోక తేనె చినుకులు = ప్రభు యేసుని

మాటలు - మా వెల్లు బాటలు ॥సృష్టి॥

5. మాదంత నీదే మహా దేవా - మా రాజువయ్యా యెహోవా = మా తనువుల్‌

మా బ్రతుకుల్‌ మా యావదాస్తి నీవే ॥సృష్టి॥

6. మేమిచ్చు కాన్మ యేపాటిది? యే (ప్రేమ నీకు సాటిది? = మోక్ష నాధా

యేసుప్రభో - అంగీకరించువిభో ॥స్ఫష్టి॥

7... తండ్రి కుమార శుద్ద్ధాత్ముడా - త్రియేక దేవ స్తోత్రముల్‌ = దాత వీవే నేతవీవే

- దేవాది దేవుండవే ॥నృష్టి॥

-ఉవిరానియల్‌

Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 316