FaithWalk
← Back to Songs

Song #445

నేను నీ సేవకుండను

రాగం: ముఖారితాళం: అటఛాయ: జీవమా చింతించకుండు

Lyrics

రా- ముఖారి (చాయ :జీవమా చింతించకుండు) తా-అట

నేను నీ వాండను దేవా - నిక్కంబుగ - నేను నీ వా౭డను దేవా = వీనుల నీ

ప్రేమ - వివర మాలించుచు - మేను నాత్మయు నిత్తు - మేలొసంగు

నీకిపుడు॥నేను॥

1. ఘనుండ వైన నీవు - గలిగించితివి నన్ను - మనుజ లోకమునందు - నిను.

నేను సేవింప ॥నేను॥

2. నాకు నవసర మౌన - నానా వస్తువు లిచ్చి - నీ కటాక్షము నన్ను -

నిల్పుచున్నది గాన ॥నేను॥

3. నా దోషముల నుండి - నన్ను రక్షింపను - నీదు పుత్రుని ప్రేమ - నిండార

నొసగితివి ॥నేను॥

4 నే నఘముల చేత - నిజముగం జావంగ - నీ నెనరుచే నన్ను - నీవు

బ్రతికించితివి ॥నేను॥

Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 314