FaithWalk
← Back to Songs

Song #444

జ్యోతిగ మము జేయుము

రాగం: ఆనందభైరవితాళం: చాపుఛాయ: గొప్ప దేవ నాకు తండ్రివి✍ విడి చభామణ్‌

Lyrics

రా -ఆనందభైరవి (చాయ : గొప్ప దేవ నాకు తండ్రివి) తా-చాపు

జ్యోతిగ మము జేయుమో దేవా - యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో

దేవా = జ్యోతిగ మము జేసి మాలో - క్రీస్తు మార్గము బయలు పరచి - నీతి

ప్రేమలతోడ హృదయము - నింపి మముసడిపింపు మయ్యా ॥జ్యోతిగ॥

సమర్పణ 345

1. మా కుటుంబము లోన నీ వెలుగు - ప్రసరించు నట్లుగ - నాదు బ్రదుకును

శుద్ధి జేయుమయ్యా = మా కుటుంబములోని వారలు - మానకను నీ వెలుగు

జూపగ - మమ్ము నీ మార్గంబునందున - మనుప పరిశుద్ధాత్మ నిడుమా॥జ్యోతిగ॥

2. సంఘమున నీ కీర్తి కనపడగ - పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి

జేయు మయా = భంగపరచెడి కక్షలన్నిటి - బాధపరచెడి శక్తులన్నిటి - పార

దోలగ శక్తినిడి నీ - భక్తి కాంతిని జూపి నాలో ॥జ్యోతిగ॥

3. నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో - మా చుట్టునున్నవి - నీ కొరకు

కనిపెట్టుచున్నవయా = అన్నివేళల నీ సువార్తను - అందరికి ప్రకటింప

మనసున- నాశనిడి నీ వార్త వెలుగును - అన్ని దిశలకు జాటునట్లుగ ॥జ్యోతిగ॥

4 సమయమును వరముల నొసంగితివి - మా రక్షకా ధన - సంపదను నీవే

యొసంగితివి = విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి - వీర

త్యాగార్చణములతో నీ - వెలుగు ప్రసరింపంగజేయను ॥జ్యోతిగ॥

-విడి చభామణ్‌

Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 314