FaithWalk
← Back to Songs

Song #442

సమర్పణ గీతము

రాగం: యమునాకళ్యాణితాళం: త్రిపుటఛాయ: నన్ను దిద్దుము

Lyrics

'రా- యమునాకళ్యాణి (చాయ : నన్ను దిద్దుము) తా-త్రిపుట

జీవితాంతము వరకు నీకే - సేవ సల్పుదునంటిని = నీవు నాతో నుండి

ధైర్యము = నిచ్చి నడుపుము రక్షకా ॥జీవితాం॥

1. ఎన్ని యాటంకంబులున్నను - ఎన్ని భయములు కల్గిన = అన్ని పోవును

నీవు నాకడ - నున్న నిజమిది రక్షకా ॥జీవితాం॥

2. అన్ని వేళల నీవు చెంతనె - యున్న యను భవమీయవె = తిన్నగా నీ

మార్గమందున - పూనినడచెద రక్షకా ॥జీవితాం॥

3. నేత్రములు మిరుమిట్లు గొలిపెడి - చిత్రదృశ్యములున్నను = శత్రువగు సాతాను

గెల్వను చాలు నీ కృప రక్షకా ॥జీవితాం॥

344 క్రైన్రవ జీవితము

4. నాదు హృదయమునందు వెలుపట - నావరించిన శత్రులన్‌ = చెదర గొట్టుము

రూపుమాపుము - శ్రీఘ్రముగ నారక్షకా ॥జీవితాం॥

5. మహిమలో నీవుండు చోటికి - మమ్ము జేర్చెదనంటివే = ఇహము దాటినదాక

నిన్ను - వీడనంటిని రక్షకా ॥జీవితాం॥

6. పాప మార్గము దరికి బోవక - పాత యాశల గోరక = ఎపుడు నిన్నే

వెంబడింపగ - కృప నొసంగుము రక్షకా ॥జీవితాం॥

నిడి చలామణీ

Section: 342 క్రైస్తవ జీవితము · Book page: 312