FaithWalk
← Back to Songs

Song #438

పవిత్ర హృదయము కొరకు ప్రార్థన

రాగం: శంకరాభరణముతాళం: త్రిపుటఛాయ: మన మొదటి తలిదండ్రుల్‌✍ ఆల్‌ఫెడ్‌ త్యాగరాజు పామ్‌

Lyrics

రా -శంకరాభరణము (చాయ : మన మొదటి తలిదండ్రుల్‌) తా-త్రిపుట

విమల హృదయ మిమ్ము - విదితంబు నిను గొల్వ - యేసునాధా = నీదు

విమల రక్తము చేత - విశదమౌ యెద నిమ్ము - విశ్వనాధా ॥విమల॥

1. అణంకువ క్షమశాంత - మధికముగ నాకిమ్ము - ఆత్మనాధా = నీకు

బ్రణుతమౌ నా యెద - ప్రభునిపీఠము జేయు - మాత్మనాధా ॥విమల॥

2. నీ చిత్తమే యంచు - నీ పాదములం బట్టి - నిల్చియుందు = నిండు -

నికరమౌ ప్రకటమౌ - సుకరహృదయ మిమ్ము - మేసునాధా ॥విమల॥॥

3. భయభక్తు లలరెడు - భావంబు నా కిమ్ము జీవనాధా = నన్ను - లయ

జీవములయందు - జయశాలినిగం జేయు - మేసునాధా ॥విమల॥

4. పరిశుద్ధ హృదయంబు - పరమేశ నా కిమ్ము - ధరణిమోంద = నన్ని -

తరుణములను నాకా - దరణ మోవే యంచు - దలంప నాధా ॥విమల॥

ర. నీ రూపము నిమ్ము - నినుం - బోలి నేనుండ - నిత్యనాధా = నీదు -

సారూప్య మెదమోద - సంపూర్తిగా (ప్రాయు - సత్యనాధా ॥విమల॥

6. ప్రేమపూరిత హృదయ - మేమరక నా కిమ్ము - (ప్రేమనాధా = యెంతో

ప్రేమమౌ సుమమౌ - నేమమౌ బ్రితుకిమ్ము - క్షేమనాధా ॥విమల॥

-ఆల్‌ఫెడ్‌ త్యాగరాజు పామ్‌

పరిశుద్ధత 341

Section: 330 క్రైస్తవ జీవితము · Book page: 310