FaithWalk
← Back to Songs

Song #423

యేసు సర్వశక్తుడు

రాగం: జంరూటితాళం: చూపుఛాయ: యేసునాధ కథాసుధారస✍ చదలవాడ జోనా

Lyrics

రా- జంరూటి (చాయ :యేసునాధ కథాసుధారస) తా-చూపు

సర్వశక్తుండ నిర్మలాత్ముండ - సర్వజనసంరక్షకా - మా = సర్వపాపముం

బరిహరింప నీ - సర్వమహిమను విడితివా ॥సర్వ॥

1. నిత్యనాశనమగ్నులగుమా - నిత్యశాపముం బాపి మరి - నీ = నిత్య జీవము

మాకునీయను - మృత్యు బాధలు పదితివా ॥సర్వ|॥

2. పాపమరణపు బంధకములనుం - దెంపి మము విడిపించుటకు - మా =

పాపమును భరించి మాకై - యాపదల పాల్పడితివా ॥సర్వః

3. మెట్టుకీబలు దుష్టులనుచే - పట్టి జీవము నిచ్చితివి - కా = బట్టి యింక నీ

కట్టడలలో - దిట్టముగ బలపరుచుమో ॥సర్వ॥

4 సత్యవిధులలో నడువనే న-శక్తుండనో రక్షకా - నీ = భృత్యునికి శక్తి నిత్యమిడి

నడి - పింపు నీ ఘనసేవలో ॥సర్వ॥

5. నీదు నామము మహిమపరుచను - నాదు జీవితకాలమున - బహు =

సాధు నిగ ననుం జేసి సాయము - నాధుండా నాకీయుమా ॥సర్వు

6. ప్రస్తుతము పరదేశినై - ప్రచురంబుంజేతు నీ స్తోత్రముల్‌ - పర = వస్తు

'ఘనరాజ్యంబుకొరకై - వాస్తవముగ నిరీక్షింతున్‌ ॥సర్వ॥

7. ముక్తినుంచి నీవు రాగా - శక్తితో, ప్రభు యేసువా - యా = సక్తితో నినుం

గూడుకొని బహు - యుక్తస్తోత్రముల్‌ జేతుము ॥సర్వ!

- చదలవాడ జోనా

Section: 330 క్రైస్తవ జీవితము · Book page: 300